आँखो में मस्ती शराब की
काली जुल्फों में राते शबाब की
जाने आई कहाँ से टूट के
मेरे दामन मे पंखुडी गुलाब की हए
आँखो में मस्ती शराब की
काली जुल्फों में राते शबाब की
जाने आई कहाँ से टूट के
मेरे दामन मे पंखुडी गुलाब की हए
आँखो में मस्ती शराब की
चाँद का टुकडा कहूँ या हुस्न की दुनिया कहूँ
चाँद का टुकडा कहूँ या हुस्न की दुनिया कहूँ
प्रीत की सर्गम कहूँ या प्यार का सपना कहूँ
सोचता हूँ क्या कहूँ
सोचता हूँ क्या कहूँ इस शोक को मै क्या कहूँ
आँखो में मस्ती शराब की
काली जुल्फों में राते शबाब की
जाने आई कहाँ से टूट के
मेरे दामन मे पंखुडी गुलाब की हए
आँखो में मस्ती शराब की
चाल कहती है न हो पेहली घटा बरसात की
चाल कहती है न हो पेहली घटा बरसात की
हर अदा अपनी जगह तारिफ हो किस बात की
आरजू कितने दिनों से
आरजू कितने दिनों से थी हमे इस रात की
आँखो में मस्ती शराब की
काली जुल्फों में राते शबाब की
जाने आई कहाँ से टूट के
मेरे दामन मे पंखुडी गुलाब की हए
आँखो में मस्ती शराब की
गायक - तलत महमूद
संगीत निर्देशक - सलिल चौधरी
बोल - राजेंद्र क्रिशन
कलाकार - सुनील दत्त, आशा पारेख
हेमंत कुमार के नाम से प्रसिद्ध हेमंता कुमार मुखोपाद्ध्याय हिन्दी और बंगाली चित्रों के प्रमुख गायक एवं संगीत निर्देशक थे। उनकी मातृ भाषा बंगाली थी। उनका जन्म 16 जून, 1920 को बनारस मे हुआ था पर उनका पालन पोषण कलकत्ता में हुआ । उन्होने "नागिन" (1954) चित्र के संगीत के लिए फिल्मफेर पुर्स्कार भी जीता। सन 1989 के सितम्बर मास मे वे धाका (बंगलादेश) गए थे। वहाँ से लौटने के तुरन्त उन्हे दिल का दौरा पडा, उसी मास के 26वी तिथी को कलकत्ता मे उनका निधन हुआ।
मेरे पास हेमंत कुमारजी की जो स्टैंप है उसे आप देख सकते है।
उनका एक गाना मै यहाँ प्रस्तुत कर रहा हूँ।
यह गाना "नागिन" (1954) फिल्म से है। अगर आप माँगे तो मै इस गाने का आडियो भेज सकता हूँ। इस गाने को मै ने पेहली बार रेडियो पर सुना था। इस गाने के बोल ऐसे है.....
अरी छोड दे सजनिया छोड दे पतंग मेरी छोड दे
ऐसे छोडूँ ना बलमवा नैनवा के डोर पेहले जोड दे
अरी छोड दे सजनिया छोड दे पतंग मॅरी छोड दे
ऐसे छोडूँ ना बलमवा नैनवा के डोर पेहले जोड दे
आशाओं का मांजा लगा रंगी प्यार से डोरी
तेरे मोहल्ले उडते उडते आई चोरी चोरी
बैरी दुनिया कही ना तोड दे पतंग मेरी छोड दे
ऐसे छोडूँ ना बलमवा नैनवा के डोर पेहले जोड दे
अरमानों की डोर लूटने खडे है दुनियावाले बानके चरखेवाले
ऊँछे नील गगन मे छोड दे पतंग मेरी छोड दे
ऐसे छोडूँ ना बलमवा नैनवा के डोर पेहले जोड दे
देख चली ये संग हवा के बलखाती इतलाती
सैय्या बलखाती इतलाती
चीर के बैरी जग का सीना गीत प्यार के गाती
देखो गीत प्यार के गाती
है किस मे इतना जोर जो काटे डोर जो सामने आए ना
फिर मेरी अथरिया पे छोड दे पतंग सय्या छोड दे
ऐसे छोडूँ ना सजनिया नैनवा की डोर पेहले जोड दे
सैय्या छोड दे पतंग मेरी छोड दे
गोरी नैनवा की डोर पेहले जोड दे
सैय्या छोड दे पतंग मेरी छोड दे
गायक - हेमंत कुमार, लता मंगेशकर
संगीत निर्देशक - हेमंत कुमार
बोल - राजेंद्र क्रिशन
कलाकार - प्रदीप कुमार, वैजयंतीमाला और अन्य
ఓగిరాల రామచంద్రరావు పేరు తెలిసినవారు తక్కువే ఉండచ్చు, కానీ ఆయన గొప్పతనం తెలిసినవారు ఆయన గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. జాతీయ పురస్కారం అందుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం అయిన పెద్ద మనుషులు (1954)కి ఆయన సంగీతదర్శకుడు. 1939లో విడుదలైన జగదీశ్ పిక్చర్స్ వారి మళ్లీ పెళ్లి సంగీతదర్శకునిగా ఆయనకి మొదటి చిత్రం, ఇదే చిత్రంలో ఓగిరాల ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ఆ చిత్రంలో బెజవాడ రాజారత్నం పాడిన "గోపాలుడే మన గోపాలుడే", "చెలి కుంకుమమే పావనమే" వంటి పాటలు పేరుపొందాయి. ఇదే చిత్రంలో ఓగిరాల, కాంచనమాలతో కలిసి "నా సుందర సురుచిరరూపా" అనే పాటని ఆలాపించారు. ఈ పాటను ఆయన వై.వి.రావు గారికి పాడారు. ఈ విధంగా ఆయన తెలుగు చలనచిత్రసీమలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు. 1939లో విడుదలైన శ్రీ వేంకటేశ్వర మహత్యంలో ఆయన శివుని వేషం వేశారు. ఆ చిత్రంలో శివుని వేషానికి ముందు వేరే నటుడిని తీసుకున్నారు, కానీ అతని మెడలో పాము వేయగానే ఆ నటుడు భయపడిపోయి ఆ వేషాన్ని వదులుకున్నాడు, దాంతో ఆ చిత్రానికి సంగీతదర్శకుడైన ఓగిరాల ఆ వేషం వేయడానికి ముందుకొచ్చారు.
1940లో విడుదలైన జగదీశ్ పిక్చర్స్ వారి విశ్వమోహినిలో బెజవాడ రాజారత్నం చేత ఓగిరాల పాడించిన పాటలు చాల పేరుపొందాయి. "ఈ పూపొదరింటా" చాలా ప్రముఖంగా వినిపించగా, ""భలే ఫేస్ భలే ఫేస్", "మేళవింపగదే చెలియా వీణ" పాటలు కూడా బాగానే పేరు సంపాదించాయి. 1941లో విడుదలైన ప్రతిభా పిక్చర్స్ వారి మొట్టమొదటి చిత్రం పార్వతీకళ్యాణంకు ఆయన తదుపరి చిత్రం. గరుడ గర్వభంగం (1943), సీతారామజననం (1944) ఆయన తదుపరి చిత్రాలు, ఈ రెండూ చిత్రాలు ప్రతిభా పిక్చర్స్ సంస్థ నిర్మించినవే. సీతారామజననం చిత్రానికి ఓగిరాల, ప్రభల సత్యనారాయణతో కలిసి పని చేశారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుతో "గురు బ్రహ్మ గురు విష్ణు" శ్లోకాన్ని పాడించారు. ఆయన తదుపరి చిత్రం వాహినీ వారి స్వర్గసీమ (1945), ఈ చిత్రంలో నాగయ్య, బాలాంత్రపు రజనీకాంతరావుతో కలిసి పని చేశారు. ఈ చిత్రం పాటలన్నింటిలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సంగీతపరంగా స్వర్గసీమను విజయవంతం చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. 1946లో విడుదలైన ప్రతిభా పిక్చర్స్ వారి ముగ్గురు మరాఠీలు సంగీతపరంగా విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు, టి.జి.కమలాదేవి పాడిన "ఛల్ ఛలో వయ్యారీ షికారీ", కన్నాంబ పాడిన "సతీ భాగ్యమే భాగ్యము", "తీరుగదా ఆశా నేడు" మరియు బెజవాడ రాజారత్నం పాడిన "జీవనము యమునా జీవనము", "రాటము భారతనారీ కవచము" తదితర పాటలు బాగా పేరు సంపాదించాయి. ఈ చిత్రంలో ముఖ్యంగా పేర్కోవలసిన పాట "జీవనము యమునా జీవనము". ఈ విధంగా చూస్తే బెజవాడ రాజారత్నంకు గాయనిగా పేరు తెచ్చిపెట్టింది ఓగిరాల అని స్పష్టంగా తెలుస్తుంది. ఓగిరాల తదుపరి చిత్రాలు నాగయ్య గారి త్యాగయ్య (1946) మరియు వాహినీ వారి యోగి వేమన (1947). ఈ రెండూ చిత్రాలకు ఆయన నాగయ్య వద్ద సహాయకునిగా పనిచేశారు. యోగి వేమనలోని పాటలలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తదుపరి చిత్రం రక్షరేఖ (1949)కు హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి పని చేశారు. 1949లో విడుదలైన వాహినీ వారి గుణసుందరి కథ అప్పట్లో అన్నీ రంగాలలో పెద్ద విజయం సాధించింది. 1950లో విడదలైన పరమానందయ్య శిష్యులు పరాజయం పొందినా పాటలు బాగానే పేరు సంపాదించాయి.
ఆయన తదుపరి చిత్రాలు మాయరంభ (1950), రాజేశ్వరి (1952), కుమారి (1952 - రాజేశ్వరి - తమిళం), సతీ సక్కుబాయి (1954). మాయరంభ లోని పాటలు, పద్యాలు ఓగిరాలకి బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రంలో నటి అంజలీదేవి చేత ఓగిరాల ఒక బృందగీతం పాడించారు. సతీ సక్కుబాయి చిత్రంలో ఎస్.వరలక్ష్మి పాడిన పాటలు బాగా ఉంటాయి. ఆయన తదుపరి చిత్రం వాహినీ వారి పెద్ద మనుషులు (1954). పెద్ద మనుషులు తరువాత టి.వి.రాజుతో కలిసి శ్రీ గౌరీ మహత్యం చిత్రానికి పని చేశారు. నాగయ్య గారు తీసిన భక్త రామదాసు (1964) ఆయన చివరి చిత్రం. ఈ చిత్రానికి ఓగిరాల నాగయ్య, అశ్వత్థామ, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి పని చేశారు.
ఓగిరాల సంగీతం అందించిన చిత్రాలలో ముఖ్యంగా పేర్కొనవలసినవి గుణసుందరి కథ (1949) మరియు పెద్ద మనుషులు (1954). ఆ రెండూ వాహిని వారి చిత్రాలు కావడం, ఆ రెండిట్లో అద్దేపల్లి రామారావు ఓగిరాలకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా పనిచేయడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఆ రెండూ చిత్రాలకు నిర్మాత మరియు దర్శకుడు కె.వి.రెడ్డి గారే మరియు రెండిట్లో నాయిక శ్రీరంజని జూనియరే.
గుణసుందరి కథ చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో ఓగిరాల సంగీతం ఒకటి. పి.లీల, టి.జి.కమలాదేవి, కస్తూరి శివరావు, శాంతకుమారి, మాలతి, ఘంటసాల తదితరులతో ఓగిరాల పాడించిన పాటలు బాగా జనాదరణ పొందాయి. ఈ చిత్రంలో పాటలన్నీ పింగళి నాగేంద్రరావు రాశారు. ఓగిరాల ఈ చిత్రంలో పి.లీల చేత పాడించిన ఒక్క "చిటి తాళం వేసెనంటే" మరియు "నాను సింగారినే మగనా" తప్ప మిగతావన్నీ భక్తి పాటలే, వాటిలో "శ్రీ తులసి ప్రియ తులసి" పాట చాలా కాలం అందరి ఇళ్ళల్లో వినిపించేది, ఆ పాట పాడుతూ ప్రతీ స్త్రీ తులసి మాతను ఆరాధించేది. శాంతకుమారి, మాలతి కలిసి పాడిన "కలకలా ఆ కోకిలేమో" మరియు "చల్లని దొరవేలె చందమామ" పాటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఘంటసాల ఈ చిత్రంలో "అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా" అనే నేపథ్యగీతం పాడారు. అలాగే కస్తూరి శివరావు, టి.జి.కమలాదేవి, వి.శివరాం పాడిన పాటలు కూడా పేరు పొందాయి.
పెద్ద మనుషుల చిత్రంలో రేలంగికి ఘంటసాల పాడిన "నందామయా గురుడ నందామయా" మరియు "శివశివ మూర్తివి గణనాథా" బాగా జనాదరణ పొందాయి. ఆ రెండూ పాటలను కొసరాజు రాశారు. పి.లీల ఈ చిత్రంలో మూడు పాటలు పాడింది, ఆమె పాడిన "నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ" పాట హిందీ చిత్రం అల్‌బేలాలోని పాటకు అనుకరణగా సంగీతం అందించారు మరియు లీలనే పాడిన "అంతభారమైతినా అంధురాలనే దేవ" పాట మనస్స్సుకు హత్తుకునే విధంగా సంగీతం అందించారు. ఈ చిత్రం జాతీయ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ విధంగా జాతీయ బహుమతి పొందిన మొదటి తెలుగు చిత్రానికి సంగీతమందించిన వ్యక్తిగా ఓగిరాల కీర్తి పొందారు.
1905లో సెప్టెంబరు 10న బెజవాడలో ఓగిరాల జనార్దనశర్మ, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన ఓగిరాల రామచంద్రరావు, 1957లో భక్త రామదాసు చిత్ర నిర్మాణ సమయంలో ఫ్లూ జ్వరం బారిన పడి జూన్ 17వ తేదీన మరణించారు. ఓగిరాల అంతిమయాత్రలో ఆయనంటే ఎంతో అభిమానమున్న ఘంటసాల సుమారు రెండు మైళ్ళు నడిచారు.
ఓగిరాల భార్య పేరు వరలక్ష్మి. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కుమారుడి పేరు నరసింహమూర్తి మరియు కుమార్తె పేరు కల్పకవల్లి. కుమారుడు నరసింహమూర్తి బాలనటుడిగా బ్రతుకు తెరువు (1953), దొంగరాముడు (1955), అప్పు చేసి పప్పు కూడు (1959) చిత్రాలలో కనిపిస్తాడు. ఆయన ఈ మధ్యే కార్పరేషన్ బ్యాంక్‌లో సీనియర్ ఉద్యోగిగా పదవీ విరమణ పొందారు. ఓగిరాలకు జాతకాలు చూసే అలవాటు ఉండేది. ఓగిరాల కొంతమంది ప్రముఖ నటుల జాతకాలు రాసిపెట్టుకున్నట్టు ఆయన కుమార్తె కల్పకవల్లి చెప్పారు.
అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు ఓగిరాల రామచంద్రరావు 54వ వర్థంతి (జూన్ 17, 2011) సంధర్భంగా జాతీయ బహుమతి పొందిన మొట్టమొదటి చిత్రం పెద్దమనుషులు (1954)లోని పాట.
అంతభారమైతినా అంధురాలనే దేవా - పి.లీల
పాట గురించి:
సంగీతం - ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం - (తెలియదు)
నటీనటులు - శ్రీరంజని జూనియర్, రామచంద్ర కాశ్యప
ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మిని గాయనిగా నిలబెట్టిన చిత్రం "మీరా" (తమిళం - 1945, హిందీ - 1947). తమిళం, హిందీ రెండూ భాషలలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. సంగీతం అదీ ముఖ్యంగా ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి పాడిన మీరా భజనలు ఈ చిత్రాల విజయానికి ముఖ్య కారణం. ఆ చిత్రాలకు అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు ఎస్.వి.వెంకట్రామన్ అందమైన సంగీతం అందించారు. హిందీ చిత్రం కూడా కర్ణాటక సంగీతం పైన ఆధారపడింది. హిందీ చిత్రంలో ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మిని సరోజిని నాయుడు ఉత్తరాది వారికి పరిచయం చేయడం విశేషం. ఈ రెండూ చిత్రాలను ఆంగ్ల చిత్రాల దర్శకుడైన ఎల్లిస్ ఆర్.డంకన్ తీయడం విశేషం. తమిళం మరియు హిందీ చిత్రాలలో ప్రముఖ నటుడు నాగయ్య మీరా భర్తగా ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మితో కలిసి నటించారు.
తమిళ చిత్రంలో ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి పాడిన "గిరిధర గోపాల బాలా" అనే భజనను ఇక్కడ పొందుపరిచాను. ఇదే భజన హిందీ చిత్రంలో కూడా ఉంటుంది. రెండూ భాషలలోనూ చిత్రీకరణ 99 శాతం ఒకే విధంగా ఉంటుంది.
గాయని - ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి
సంగీతం - ఎస్.వి.వెంకట్రామన్
సాహిత్యం - మీరాబాయి సాహిత్యం
గిరిధర గోపాల బాలా
గిరిధర గోపాల బాలా
గిరిధర గోపాల
శ్యామల శరీర కౌస్తుభహార
శ్యామల శరీర కౌస్తుభహార
పీతాంబరధర ప్రభో మురారే
పీతాంబరధర ప్రభో మురారే
గిరిధర గోపాల
గాలి పెంచల నరసింహారావు ఆ పేరు వింటే చాలామందికి గుర్తుకువచ్చేది "సీతారాముల కళ్యాణం చూతము రారండి" పాట. ఇంతటి గొప్ప పాటకు చాలా గొప్ప సంగీతదర్శకుడు గాలి పెంచల. ఆయన ఇంటిపేరు గాలి, ఆయన పేరు పెంచల నరసింహారావు. చాలామంది ఆయన ఇంటిపేరును గాలిపెంచల అనుకుంటారు. మాలపిల్ల (1938), కృష్ణప్రేమ (1943) వంటి చిత్రాలలో కథానాయకునిగా నటించిన గాలి వెంకటేశ్వరరావు, గాలి పెంచల సోదరుడు. గాలి పెంచల శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వ్యక్తి. ఆయన సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి. ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం సీతాకళ్యాణం (1934), ఇది దక్షిణభారతదేశంలో తయారైన మొట్టమొదటి చిత్రం. ఆయన సంగీతం అందించిన చివరి చిత్రం ఎన్.ఏ.టి. వారి సీతారామకళ్యాణం (1961). ఆయన సంగీతం అందించిన మొదటి, చివరి చిత్రాలు రెండూ ఒకే కథ ఆధారంగా తయారవడం కాకతాళీయం. అగ్నిపరీక్ష (1951) చిత్రానికి సంగీతం అందించిన దాదాపు పదేళ్ళ తర్వాత ఆయన సీతారామకళ్యాణం చిత్రానికి సంగీతం అందించారు. ఘంటసాల సంగీతదర్శకుడిగా ఎదగడానికి ముఖ్య కారణం గాలి పెంచల. ఆయన సంగీతం అందించిన పల్నాటి యుద్ధం (1947), బాలరాజు (1948) చిత్రాలకు ఘంటసాలను సహాయకునిగా పెట్టుకున్నారు. బాలరాజు చిత్రంలో ఘంటసాల చేత కొన్ని పాటలకు స్వరరచనను చేయించారు. పల్నాటి యుద్ధం చిత్రంలో ఘంటసాల, కన్నాంబ చేత ఒక భక్తగీతం పాడించారు. ఆ పాట "తెరతీయగరాదా దేవా". ఆ పాటకు సంగీతం, సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉంటాయి. మాయాబజార్ (1957) చిత్రంలో ఘంటసాల స్వరపరిచిన "వివాహ భోజనంబు" పాటకు గాలి పెంచల స్వరపరిచిన మాయాబజార్ (1936) చిత్రంలోని "వివాహ భోజనంబు" పాట ఆదర్శం. గాలి పెంచలకు "సంగీతోపాధ్యాయ" అని బిరుదు. 1903లో జన్మించిన గాలి పెంచల, 61 ఏళ్ళ వయస్సులో మే 25, 1964న మరణించారు.
ఇంకా ఎక్కువ సమాచారం కోసం ఈ కింద లింకును అనుసరించండి.
'సంగీతోపాధ్యాయ' గాలి పెంచల నరసింహారావు 47వ వర్థంతి సంధర్భంగా నా నివాళి.
పాట - ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా
గాయని - ఎస్.వరలక్ష్మి
సంగీతం - గాలి పెంచల నరసింహారావు
సాహిత్యం - సముద్రాల రాఘవాచార్య
ఇది నా మొట్టమొదటి పోస్ట్. 1949లో విడుదలైన గుణసుందరి కథ చిత్రం శీర్షికలను ఇక్కడ పొందుపరిచాను. ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. ప్రముఖ చిత్రరచయిత పింగళి నాగేంద్రరావు ఈ చిత్రంతోనే పరిచయమయ్యారు, ఇంతకముందు ఆయన రాసిన నాటకాలుకొన్ని చిత్రాలుగా తయారయ్యాయి కానీ అపజయం పొందాయి. ఈ చిత్రంతో ఆయన ప్రత్యక్షంగా చలనచిత్రాలకు పనిచేయడం మొదలుపెట్టారు. ఈ చిత్ర శీర్షికలకు సంగీతదర్శకుడు ఓగిరాల రామచంద్రరావు వినుసొంపైన సంగీతం అందించారు, వాద్యనిర్వహణ అద్దేపల్లి రామారావు గారిది. శీర్షికలు ఆంగ్లంలో ఉండడం చేత, ఆ భాషలోనే పొందుపరిచాను. పోస్టు చివరిలో చిత్ర శీర్షికల వీడియోను చూడవచ్చు. (యూట్యూబ్‌లో నేను పూర్తి చిత్రాన్ని పెట్టి ఉంచాను, మీరు దానిని చూడటానికి లింకు పెట్టుతున్నాను)