![]() |
| "మీరా" చిత్రంలో ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి |
![]() |
| సంగీతదర్శకుడు ఎస్.వి.వెంకట్రామన్ |
ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మిని గాయనిగా నిలబెట్టిన చిత్రం "మీరా" (తమిళం - 1945, హిందీ - 1947). తమిళం, హిందీ రెండూ భాషలలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. సంగీతం అదీ ముఖ్యంగా ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి పాడిన మీరా భజనలు ఈ చిత్రాల విజయానికి ముఖ్య కారణం. ఆ చిత్రాలకు అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు ఎస్.వి.వెంకట్రామన్ అందమైన సంగీతం అందించారు. హిందీ చిత్రం కూడా కర్ణాటక సంగీతం పైన ఆధారపడింది. హిందీ చిత్రంలో ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మిని సరోజిని నాయుడు ఉత్తరాది వారికి పరిచయం చేయడం విశేషం. ఈ రెండూ చిత్రాలను ఆంగ్ల చిత్రాల దర్శకుడైన ఎల్లిస్ ఆర్.డంకన్ తీయడం విశేషం. తమిళం మరియు హిందీ చిత్రాలలో ప్రముఖ నటుడు నాగయ్య మీరా భర్తగా ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మితో కలిసి నటించారు.
గాయని - ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి
సంగీతం - ఎస్.వి.వెంకట్రామన్
సాహిత్యం - మీరాబాయి సాహిత్యం
గిరిధర గోపాల బాలా
గిరిధర గోపాల బాలా
గిరిధర గోపాల
శ్యామల శరీర కౌస్తుభహార
శ్యామల శరీర కౌస్తుభహార
పీతాంబరధర ప్రభో మురారే
పీతాంబరధర ప్రభో మురారే
గిరిధర గోపాల
నందసుకుమార మనమోహనాకార
నందసుకుమార మనమోహనాకారబృందావనచర తులసీహార
బృందావనచర తులసీహార
గిరిధర గోపాల బాలా
గిరిధర గోపాల
గిరిధర గోపాల..... ఆఆఆ.....
గిరిధర గోపాల కంస విధార
గిరిధర గోపాల కంస విధార
మీరా మానస సరోవిహార
మీరా మానస సరోవిహార
గిరిధర గోపాల బాలా
గిరిధర గోపాల
బా..లా...
గిరిధర గోపాల కంస విధార
మీరా మానస సరోవిహార
మీరా మానస సరోవిహార
గిరిధర గోపాల బాలా
గిరిధర గోపాల
బా..లా...
యూట్యూబ్లో తమిళ చిత్రంలోని వీడియో
యూట్యూబ్లో హిందీ చిత్రంలోని వీడియో.


ప్రణీత్ !
రిప్లయితొలగించండిబావుంది. మంచి ప్రయత్నం. అభినందనలు