25, మే 2011, బుధవారం

సుప్రసిద్ధ సంగీతదర్శకుడు గాలి పెంచల


గాలి పెంచల నరసింహారావు ఆ పేరు వింటే చాలామందికి గుర్తుకువచ్చేది "సీతారాముల కళ్యాణం చూతము రారండి" పాట. ఇంతటి గొప్ప పాటకు చాలా గొప్ప సంగీతదర్శకుడు గాలి పెంచల. ఆయన ఇంటిపేరు గాలి, ఆయన పేరు పెంచల నరసింహారావు. చాలామంది ఆయన ఇంటిపేరును గాలిపెంచల అనుకుంటారు. మాలపిల్ల (1938), కృష్ణప్రేమ (1943) వంటి చిత్రాలలో కథానాయకునిగా నటించిన గాలి వెంకటేశ్వరరావు, గాలి పెంచల సోదరుడు. గాలి పెంచల శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వ్యక్తి. ఆయన సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి. ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం సీతాకళ్యాణం (1934), ఇది దక్షిణభారతదేశంలో తయారైన మొట్టమొదటి చిత్రం. ఆయన సంగీతం అందించిన చివరి చిత్రం ఎన్.ఏ.టి. వారి సీతారామకళ్యాణం (1961). ఆయన సంగీతం అందించిన మొదటి, చివరి చిత్రాలు రెండూ ఒకే కథ ఆధారంగా తయారవడం కాకతాళీయం. అగ్నిపరీక్ష (1951) చిత్రానికి సంగీతం అందించిన దాదాపు పదేళ్ళ తర్వాత ఆయన సీతారామకళ్యాణం చిత్రానికి సంగీతం అందించారు. ఘంటసాల సంగీతదర్శకుడిగా ఎదగడానికి ముఖ్య కారణం గాలి పెంచల. ఆయన సంగీతం అందించిన పల్నాటి యుద్ధం (1947), బాలరాజు (1948) చిత్రాలకు ఘంటసాలను సహాయకునిగా పెట్టుకున్నారు. బాలరాజు చిత్రంలో ఘంటసాల చేత కొన్ని పాటలకు స్వరరచనను చేయించారు. పల్నాటి యుద్ధం చిత్రంలో ఘంటసాల, కన్నాంబ చేత ఒక భక్తగీతం పాడించారు. ఆ పాట "తెరతీయగరాదా దేవా". ఆ పాటకు సంగీతం, సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉంటాయి. మాయాబజార్ (1957) చిత్రంలో ఘంటసాల స్వరపరిచిన "వివాహ భోజనంబు" పాటకు  గాలి పెంచల స్వరపరిచిన మాయాబజార్ (1936) చిత్రంలోని "వివాహ భోజనంబు" పాట ఆదర్శం. గాలి పెంచలకు "సంగీతోపాధ్యాయ" అని బిరుదు. 1903లో జన్మించిన గాలి పెంచల, 61 ఏళ్ళ వయస్సులో మే 25, 1964న మరణించారు.

ఇంకా ఎక్కువ సమాచారం కోసం ఈ కింద లింకును అనుసరించండి.

'సంగీతోపాధ్యాయ' గాలి పెంచల నరసింహారావు 47వ వర్థంతి సంధర్భంగా నా నివాళి.
పాట - ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా
గాయని - ఎస్.వరలక్ష్మి
సంగీతం - గాలి పెంచల నరసింహారావు
సాహిత్యం - సముద్రాల రాఘవాచార్య

7, మే 2011, శనివారం

గుణసుందరి కథ (1949)

ఇది నా మొట్టమొదటి పోస్ట్. 1949లో విడుదలైన గుణసుందరి కథ చిత్రం శీర్షికలను ఇక్కడ పొందుపరిచాను. ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. ప్రముఖ చిత్రరచయిత పింగళి నాగేంద్రరావు ఈ చిత్రంతోనే పరిచయమయ్యారు, ఇంతకముందు ఆయన రాసిన నాటకాలుకొన్ని చిత్రాలుగా తయారయ్యాయి కానీ అపజయం పొందాయి. ఈ చిత్రంతో ఆయన ప్రత్యక్షంగా చలనచిత్రాలకు పనిచేయడం మొదలుపెట్టారు. ఈ చిత్ర శీర్షికలకు సంగీతదర్శకుడు ఓగిరాల రామచంద్రరావు వినుసొంపైన సంగీతం అందించారు, వాద్యనిర్వహణ అద్దేపల్లి రామారావు గారిది. శీర్షికలు ఆంగ్లంలో ఉండడం చేత, ఆ భాషలోనే పొందుపరిచాను. పోస్టు చివరిలో చిత్ర శీర్షికల వీడియోను చూడవచ్చు. (యూట్యూబ్‌లో నేను పూర్తి చిత్రాన్ని పెట్టి ఉంచాను, మీరు దానిని చూడటానికి లింకు పెట్టుతున్నాను)

The Vauhini Productions Ltd. Presents

Guna Sundari Katha

వాహినీ ప్రొడక్షన్స్ లిమిటెడ్ వారి

గుణసుందరి కథ

Starring
* Dr.G.V.Subba Rao as Father
* Santhakumari , Malathi , Sreeranjani (Jr) as Daughters
* G.Subba Rao, Relangi, Sivarao, V.Sivaram as Sons-in-Law

Supported by
* T.G.Kamala, Hemalatha, Kanakam, Lakshmirajyam (Jr), Seetha, Vijayalakshmi, Annapurna, Anjanibai
* Gowripathy Sastry, Sadasiva Rao, V.Lakshmikantham, C.Nageswara Rao B.A., S.Nageswara Rao, Koteswara Rao, K.Subba Rao, B.Narayana Rao
and Others

Story, Dialogues & Songs
Pingali Nagendra Rao

Screenplay
K.V.Reddi B.Sc.(Hons)
K.Kameswara Rao B.A.

Music Direction
O.Ramachandra Rao

Dances
P.Krishnamurthy

Orchestration
A.Rama Rao

Art Direction
* K.Nageshwara Rao B.A.
* Assistants
P.Devalingam..........Moulding
S.Govindaswamy..........Settings
M.S.Ratnaswamy, R.Muthu..........Paintings

Photography
* Marcus Bartley
* Assistants - B.N.Konda Reddy, S.Rajamani

Audiography
* A.Krishnan B.A., P.V.Koteswara Rao
* Assistants - D.M.Sundaram, Peter Bartley

Make-up
Hari Babu, K.Doraiswamy, S.S.R.Moorthy, M.Peetambaram, P.Appalaswamy

Processing
* N.C.Sen Gupta
* Assistants - V.Thyagarajan, N.Bhaskaran

Editing
* C.P.Jamboolingam
* Assistants - M.S.Money

Production-in-charge
C.Nageshwara Rao B.A.
M.S.Chalapathi

Assistant Director
D.B.G.Tilak

Produced & Processed at
The Vauhini Studios, Madras

Photographed on
The Miracle Mitchell Camera

Recorded on
Western Electric Sound System

Associate Director
K.Kameswara Rao B.A.

Produced & Directed by
K.V.Reddi B.Sc.(Hons)

దర్శకుడు
కే.వి.రెడ్డి

Sole Distributors
The Vauhini Pictutres Ltd., Madras

ఈ వీడియో ద్వారా శీర్షికలని వీక్షించవచ్చు.